వంద రోజుల గడప గడప
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్విరామంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఈ కార్యక్రమాన్ని అత్యంత అంకితభావంతో ఎండా వానను సైతం లెక్కచేయక, పార్టీ శ్రేణులను ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, అనుకున్న సమయానికి సందర్శించవలసిన వార్డులను సందర్శిస్తూ, ప్రజల సమస్యలపై ద్రుష్టి సారిస్తూ, ప్రభుత్వ పధకాల అమలులో పారదర్శకతను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఆదివారం అనగా నేటికీ వంద రోజుల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేరుకోగా, 36వ వార్డులో రాచమల్లు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు ఆయన సతీమణి 26వ వార్డు కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి ప్రజలతో మమేకమై వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడారు, వార్డులో గల అంగన్వాడి సెంటర్లను మరియు సచివాలయాన్ని సందర్శించి అక్కడ విషయాలను తెలుసుకొన్నారు. వార్డు ఇంచార్జి కాకర్ల నాగశేషా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనగా, కోలాటం చెక్క భజనలతో వార్డు మారుమ్రోగింది. ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగగా వార్డు లోని ప్రజలు రాచమల్లుకు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వం అని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు మరోమారు ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో 36 వార్డు కౌన్సిలర్ అలవలపాటి అరుణాదేవి, 36వ వార్డు ఇంచార్జ్ కాకర్ల నాగశేషారెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీ, ప్రొద్దుటూరు మాజీ మండలాధ్యక్షుడు రాజారాం రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ చైర్ పర్సన్ జింక విజయలక్ష్మి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ కల్లూరు నాగేంద్ర రెడ్డి, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు సాన బోయిన శేఖర్ యాదవ్, కో ఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్,లు సర్పంచులు, MPTC లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు రాష్ట్ర డైరెక్టర్లు, కో ఆప్షన్ సభ్యులు, మహిళా నాయకురాళ్లు, సచివాలయ సిబ్బంది 36 వార్డు వైఎస్ఆర్ సీపీ నాయకులు, వార్డు ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.
Comments