పరీక్షల వేళల్లో విద్యుత్తు కోతలు విధించవద్దు, కరెంటు కోతలతో విద్యార్థులను అసౌకర్యాల గురి చేయవద్దు - ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు తుమ్మల లవ కుమార్
(ఆర్.ఎస్. మహమ్మద్ రఫీ, ప్రసన్న ఆంధ్ర విలేకరి, రాయచోటి) అన్నమయ్య జిల్లా, రాయచోటి, విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న వేళ ఈ వేసవిలో కరెంటు కోతలు లేకుండా చేయడం ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు తుమ్మల లవకుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని విద్యుత్ శాఖ జిల్లా అధికారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలతో విద్యార్థిని,విద్యార్థులు చదువుకోవడానికి రాత్రి సమయాలలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి,ఇంటర్మీడియట్,యోగి వేమన యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతున్న వేళ కరెంటు కోతలు విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు.కనీసం పరీక్షలు జరిగే సమయాలలో అయినా విద్యుత్ కోతలు లేకుండా చేసి విద్యార్థులకి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి కిరణ్ కుమార్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comentários