ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే కరోనా కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు నడిపిస్తున్నామని వెల్లడించారు. ప్రతి మండలానికి 2 లేదా 3 జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అందులో భాగంగా ఫౌండేషన్ పద్ధతిని ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని.. ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని హామీ ఇచ్చారు.
top of page
bottom of page
コメント