ముగిసిన బయో టెక్నలాజికల్ ఇన్నోవేషన్ జాతీయ సమావేశాలు
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలోని వెటర్నరీ కళాశాల నందు శుక్రవారం ఎస్.వి.ఎస్.బి.టి 11వ వార్షిక సమావేశం మరియు జీవనోపాధి కోసం పశువులు మరియు కోళ్ల పెంపకం, వాటి ఆరోగ్యం, అలాగే ఉత్పాదకతను పెంపొందించడానికి బయో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ జాతీయ సమావేశాలు అక్టోబర్ 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించగా, శుక్రవారం ముగింపు సమావేశానికి విశిష్ట అతిథిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ డాక్టర్ జెవి రమణ, డాక్టర్ డివిఆర్ ప్రకాశరావు - న్యూఢిల్లీ, డాక్టర్ ఉమేష్ చంద్ర శర్మ - న్యూఢిల్లీ, కార్యక్రమానికి ప్రెసిడెంట్ గా ప్రొఫెసర్ అండ్ డాక్టర్ కే వీర బ్రహ్మయ్య, ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్.వి.ఎస్.బి.టి డాక్టర్ ఏజే ధమని, ప్రెసిడెంట్ డాక్టర్ సిహెచ్ శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజా కిషోర్ లు వ్యవహరించగా, వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రొఫెసర్లు, సైంటిస్టులు, పీహెచ్డీ విద్యార్థులు, అలాగే ఎస్.వి.ఎస్.బి.టి వెటర్నరీ విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ, పశుపోషణ వాటి ఉత్పత్తులు నుండి ఆదాయాన్ని గణనీయంగా అభివృద్ధి పరచుకోవడం, అలాగే పశువులకు కావలసిన వైద్యం సకాలంలో అందించటం, ముఖ్యంగా ఎదకు వచ్చిన ఆవులను గేదెలను సంరక్షించుట, పాల ఉత్పత్తుల గురించి పలు గ్రామాల నుండి వచ్చిన రైతులకు అవగాహన కల్పిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన పశు వైద్యశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తన మాటను మన్నించి ఇక్కడ పశు వైద్యశాల నెలకొల్పటం, గతంలో ఇక్కడి పశువైద్యశాల ప్రొద్దుటూరు పాలకేంద్రం నుండి గోపవరానికి తరలించిన తీరును అక్కడికి వచ్చిన ప్రొఫెసర్లకు, డాక్టర్లకు, విద్యార్థులకు ఎమ్మెల్యే వరద గుర్తుచేస్తూ ఒకానొక సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. నాడు తాను తీసుకున్న నిర్ణయం ద్వారా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ వెటర్నరీ డాక్టర్లుగా శిక్షణ పొంది పశు వికాసానికి తోడ్పడుతూ మూగజీవాలకు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వరద ను ఘనంగా సన్మానించారు.
I feel very happy for updates