ఈ నెల 14 వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావించుకుందాం.
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకుల జాబితా తీసుకుంటే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న స్థానం ప్రత్యేకం. ఆయన తన సినిమాల విజయాలకు, పరాజయాలకు కుంగిపోని వ్యక్తి.
డిగ్రీలు లేకపోతే ఏమి సమాజాన్ని బాగుచేయగల జ్ఞానం, సత్తా ఆయన సొంతం. ప్రస్తుత రాజకీయాల్లో నిజాన్ని నిర్భయంగా వ్యక్తీకరణ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.
తెలుగు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే కాకుండా అవసరమైతే వారి కోసం పోరాటం చేయడమే ధ్యేయంగా ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఒక సంచలనం. విభజన తరువాత కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తపించిన నేత పవన్.
2014 నుంచి నేటి ఆయన చేయని పోరాటం లేదు. ఉద్దానం కిడ్నీ బాధితులు, అమరావతి రాజధాని రైతుల కోసం, ప్రత్యేక హోదా కోసం ఆనాటి ప్రతిపక్షం కంటే ముందే గొంతెత్తిన నేత పవన్.
పవన్ ఈనాటి కుళ్లు రాజకీయాల్లో ఇమడ గలడా అంటూ రాజకీయ మేధావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పటా పంచెలు చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాడు.
Comments