16,600 సూచనలు పరిగణలోకి తీసుకొని 26 జిల్లాల ఏర్పాటు.
ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల నుంచి 26 జిల్లాలను విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానించింది. ప్రజల నుంచి ప్రభుత్వానికి 16,600 సూచనలు, అభ్యంతరాలు అందాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.
అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి సూచనలు చేశారు. సిబ్బంది విభజన, ఆరు అంశాల ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటు, పరిపాలన పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ అదనంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు.
Comments