29వ తేదీన ఏపీ విద్యుత్ బిసి ఉద్యోగుల 18వ రాష్ట్ర మహాసభ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన కడప నగరంలోని జడ్పీ హాల్ నందు, ఏపీ విద్యుత్ బిసి ఉద్యోగుల 18వ రాష్ట్ర మహాసభ జరగనున్నట్లు ఆ సంఘ ప్రెసిడెంట్ పీవీ మురళీమోహన్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొట్టమొదటిసారి కడప వేదికగా ఈ మహాసభలు జరుగుతున్నట్లు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొననున్నట్లు, రాష్ట్ర అధ్యక్షులు జీకే వీరభద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ నేతృత్వంలో పి.వి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర మహాసభలు కడప నగరంలోని జడ్పీ హాల్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సిపిఎస్ రద్దు చేయాలని చర్చించనున్నట్లు, అనంతరం 20204 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో పరువు పలువురు విద్యుత్ బిసి సంఘ ఉద్యోగ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments