టిడిపి తీర్థం పుచ్చుకొన్న కౌన్సిలర్ మునీర్
కడప జిల్లా, ప్రొద్దుటూరు
అసమ్మతి నేతలలో ఒకరిగా ముద్రపడి, గత కొద్ది నెలలుగా ఎమ్మెల్యే రాచమల్లు పై అసంతృప్తి గా ఉన్న 19వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్. గడచిన రెండు రోజుల క్రితం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి పాఠకులకు విధితమే. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం 19వ వార్డులోని ఆయన నివాసం వద్ద వార్డులోని ఆయన అనుచరులు, బంధు వర్గం, వార్డు ప్రజల సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మునీర్ కు టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మునీర్ మాట్లాడుతూ, తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడించడం తనకు ఎంతో బాధ కలిగించిందని, అందుకనే తాను వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు, గౌరవం విలువ దక్కని చోట తాను ఉండలేనని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడి వార్డు నందు ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజన్ నచ్చటం వలనే టిడిపిలో చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేసి తమ సత్తా చాటుతామాని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కార్యక్రమానికి విచ్చేసిన మైనారిటీ సోదర సోదరీమణులను ఉద్దేశించి హిందీ భాషలో ప్రసంగించి ఆశ్చర్యచికితులను చేశారు. అనంతరం 19వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు ఈ.వి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నల్లబోతుల నాగరాజు, పలువురు టీడీపీ జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments