రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక-విలువైన నోటును ప్రవేశపెట్టడం జరిగింది.
2023 నవంబర్ 8 వ తేదీకి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ₹2,000 రూపాయల నోటుకు రేపటితో కాలం చెల్లి వెల వెల పోనుంది. 2000 రూపాయల నోటు జమ చేయడానికి చివరి రోజు రేపే. ఎంత భద్రంగా బీరువాలో పెట్టుకున్నటువంటి ₹2000 నోటు బయటకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రేపటిలోగా తమ ఖాతాలో మార్చుకోవాలని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసింది. సెప్టెంబర్ 30 లోపు జమ చేయడానికి చివరి అవకాశం.
Kommentare