top of page
Writer's pictureEDITOR

2000 నోట్ల మీద పరిమితి

2000 నోట్ల మీద పరిమితి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు మంగళవారం ఉదయం నుండి దేశంలోని అన్ని బ్యాంకుల మీద కొత్త నియమాలను అమలులోకి తీసుకు వస్తోంది. బ్యాంకులు ఈ రోజు మంగళవారం నుండి కస్టమర్ల నుండి 2000 రూపాయల నోట్లు స్వీకరించగలుగుతాయి గానీ, మళ్లీ కస్టమర్లకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2,000 రూపాయల నోట్లని ఇవ్వకూడదు.

డిసెంబర్ 2019 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను ముద్రించడం నిలిపివేసింది. మనీలాండరింగ్ లాంటి కార్యకలాపాలు పెద్ద నోట్లను వాడుతున్నట్లు మోదీ ప్రభుత్వం భావించడం వలన దశలవారీగా 2,000 నోట్లని ఉప సమర్ధించే యోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే 2000 రూపాయల నోట్లని రద్దు చెయ్యడానికి సన్నాహాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ATM లలో కూడా ఉండవు


ఈ రోజు నుండి ATM మెషిన్లలో కూడా రూ. 2,000 రూపాయల నోట్లు లోడ్ చెయ్యొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది.

42 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page