ఈ చీర ఖరీదు రూ.21 లక్షలు!
ఆడవారికి చీరలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు మహిళలు వెనకాడరు. కాగా, యూపీలోని లఖ్నవూలోని ఓ వస్త్రదుకాణంలో విక్రయిస్తున్న రూ.21 లక్షల చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటి వాటి వల్ల దీనికి ఇంత ధర పలుకుతున్నట్లు షాపు యజమాని తెలిపారు. దీని తయారీకి రెండేళ్లు పట్టిందని, ఈ చీరకు షిఫాన్, చికెన్కారీ కుట్లే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు.
댓글