వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ వార్డుల నందు మౌలిక వసతుల కల్పన లో భాగంగా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, తాజాగా నియోజకవర్గ పరిధిలోని 25వ వార్డు నందు కౌన్సిలర్ షేక్ మెహరూన్, వైసీపీ వార్డు ఇన్చార్జి నూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపడుతోందని, ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పై జిల్లా వాసిగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని, రాష్ట్రంలోని ప్రతి సచివాలయ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు 20 లక్షల రూపాయల నిధులు సమకూర్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడి వార్డు సచివాలయానికి కేటాయించిన నిధులతో వార్డు నందు 26 లక్షల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇక్కడి వార్డు ప్రజల తలరాతలు మారలేదని వైసిపి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments