పేదవారికి ఆర్థిక భరోసా కల్పించడమే జగన్ లక్ష్యం - ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే జగన్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక 34వ వార్డులో కౌన్సిలర్ పోసా వరలక్ష్మి వార్డు వైసిపి ఇన్చార్జ్ పోసా భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న అంగన్వాడి సెంటర్లను తనిఖీ చేసి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు వారికి సరైన భోజనం వసతి చదువుకునేందుకు అవసరమైన వస్తువులు భోజన సదుపాయాలు వాటిపై ఆరా తీశారు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడి సెంటర్లను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నాడని పేర్కొన్నారు.
అనంతరం ఇంటింటికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును అభివృద్ధి కార్యక్రమాల పై ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రతి పేదవానికి సంక్షేమ పథకాల తో ఆర్థిక భరోసా కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ప్రజలకు ఇన్ని మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు. మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి రెడ్డి, కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశిధర్ రెడ్డి, పిట్ట బాలాజీ, ఇర్ఫాన్ భాష, కమల్ భాష, అనిల్ కుమార్, గోపవరం ఎంపీటీసీ భూసం రవీంద్రనాథ్(రవి), వైసీపీ నాయకులు ఆచారి కాలనీ శివారెడ్డి, డీలర్ ఆంజనేయులు .స్నూకర్ భాస్కర్ .ఎద్దుల రాయపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments