పక్కాగా మేనిఫెస్టో అమలు - రాచమల్లు
- భారీ గజమాలతో స్వాగతం పలికిన వార్డు ప్రజలు
- రాఖీలు కట్టి, మంగళ హారతులతో సాదర ఆహ్వానం
– అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నాం
– అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి
– ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారం
– మేం బాధ్యతల నుంచి ఎప్పటికీ తప్పించుకోం
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ
– 35వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం
ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 3
శనివారం సాయంత్రం 35వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి కౌన్సిలర్ పిట్టా బాలాజీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. వార్డులో ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాచమల్లు ను గజామాలతో స్వాగతం పలుకగా, మహిళలు రాఖీలు కట్టి, మంగళహారతులతో సాదర ఆహ్వానం పలికారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీ కూడా మేనిఫెస్టోను పక్కాగా అమలు చేసిన పరిస్థితి లేదు. తొలిసారిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు’’ అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని 35వ వార్డులో కౌన్సిలర్ పిట్టా బాలాజీ, తల్లి పిట్టా భద్రమ్మ లతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించడంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకున్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, 40 ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, కౌన్సిలర్లు వంశీధర్ రెడ్డి, షేక్ కమల్ భాష, జిలాన్, ఇర్ఫాన్ భాష, గరిశపాటి లక్ష్మీదేవి, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజిని రాగా నరసింహులు, డీలర్ రామాంజనేయులు, స్నూకర్ భాస్కర్, వైసిపి నాయకులు ఆచారి కాలనీ శివారెడ్డి, వార్డ్ వాలంటర్లు, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments