ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి,
విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి బ్లాస్ట్ ఫర్నేస్ విభాగం ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.వీరిని ఉద్దేశించి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు జె అయోధ్య రామ్, జె రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం కి కృత్రిమ కొరతను సృష్టించి ఉత్పత్తి పై భంగం కలిగించాలని ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక యాజమాన్యం తదనుగుణంగా ప్రవర్తిస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. అందుకే నేడు ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నేస్-3 లో ఉత్పత్తి చేయటం లేదని వారు వివరించారు. అలాగే కోల్ కొనుగోళ్ల జరగకుండా కోకో ఓవెన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించి తద్వారా లభించే గ్యాస్ ఆధారంగా పనిచేసే మిగిలిన విభాగాల ఉత్పత్తులను తగ్గిస్తుందని వారన్నారు. నేడు మార్కెట్లో పూర్తిగా తయారైన స్టీల్ కు మంచి గిరాకీ ఉన్నప్పటికీ మధ్యలోనే ఆపి తద్వారా లాభాలను తగ్గిస్తున్నారని వారు స్పష్టం చేశారు. ఉత్పత్తి అంతరాయాలను అధిగమిస్తూ కార్మిక వర్గం తమ రికార్డులను వారే అధిగమిస్తూ ఉత్పత్తి చేస్తున్నారని వారన్నారు. ఈ సమయంలో పోరాటాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహించడం మనందరి కర్తవ్యం అని వారు పిలుపునిచ్చారు.
దీక్షా శిబిరంలో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రతినిధులు యు రామస్వామి, పి నగేష్, సన్ని బాబు, డి శ్రీనివాసరావు, ఆర్ వెంకట రావు, గోపాలకృష్ణ, జి మహేష్, సి హెచ్ సూర్యనారాయణ, ఎమ్ జి శంకర్, జి వేణుగోపాలరావు, కె మధు, బి రామారావు, దుష్యంత్, ఎ.వి. కృష్ణ, కె.వి.రెడ్డి, కుమార్ తదితరులతోపాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Comments