39వ వార్డులో గడప గడప
ప్రొద్దుటూరు సెప్టెంబర్ 23 ప్రసన్న ఆంధ్ర :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గడప గడపకు మన ప్రభుత్వం' ముఖ్య ఉద్దేశం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అర్హత ఉన్న వారు ఎవ్వరు కూడా సంక్షేమ పథకాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మునిసిపాలిటి పరిధిలోని 39వ వార్డు నందు శుక్రవారం ఉదయం కౌన్సిలర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరిగి స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు, బేడ బుడగ జంగాల కులాల వారు ఎక్కువగా నివాసం ఉంటున్న ఈ వార్డు నందు మురికి కాలువలు కొన్ని చోట్ల అస్సలు లేకపోవటం ఎమ్మెల్యే రాచమల్లు గమనించారు, వార్డులోని మహిళలు త్రాగునీరు సరిగా రావటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన ఆయన తగు చర్యలకు ఉపక్రమించమని అధికారులను ఆదేశించారు. ఇక్కడి సచివాలయ పరిధిలోని ప్రజా సమస్యలపై దృష్టి సారించి వెనువెంటనే పరిష్కార దిశగా అడుగులు వేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్ట బాలాజీ, అనిల్ కుమార్, యాల్లాల మహమ్మద్ గౌస్, షేక్ కమల్ భాష, గరిశపాటి లక్ష్మీదేవి, ఇర్ఫాన్ భాష, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజిని, రాగా నరసింహారావు, టీటీడీ పాలక మండలి సభ్యులు మారుతి ప్రసాద్, వైసిపి నాయకులు 40వ వార్డు ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, అగ్గరపు శ్రీనివాసులు, రామ్మోహన్ రెడ్డి, రాయపు రెడ్డి, కంభం పాములేటి, డీలర్ ఆంజనేయులు, ఆచారి కాలని శివారెడ్డి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments