శాశ్వత త్రాగునీటి పరిష్కారం - రాచమల్లు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
శనివారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవరగా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 39వ మునిసిపల్ వార్డు నందు మూడవ రోజు పర్యటించారు. కౌన్సిలర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్దఎత్తున హాజరు కాగా, ఎమ్మెల్యే రాచమల్లు ప్రజా సమస్యలపై దృష్టిసారిస్తూ, ప్రజలతో మమేకమై ముందుకు సాగారు. దాదాపు ఎనిమిది వందల యాబై మంది లబ్దిదారులను ఆయన స్వయంగా పలకరించి మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితో తొంబై తొమ్మిది రోజుల పాటు గడప గడప కార్యక్రమం నిర్వహించామని, ఇందులో వైసీపీ నాయకుల, కార్యకర్తల కృషిని ఆయన శ్లాఘించారు. అర్హులందరికీ సంక్షేమ పధకాలు అమలు చేశామని, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, కాలువలు, లైబ్రరీ, రోడ్లు, సచివాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, పార్కులు అభివృద్ధి చేస్తున్నామని, మరో 520 కోట్లు అభివృద్ధి పనులు టెండర్ దశకు వచ్చాయని, మరో నెలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పార్టీలు మారినా ఇక్కడి ప్రజల తల రాత మారలేదని, దాదాపు ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధిని ఎరుగని ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు అన్నారు. ఇరవై నాలుగు వేల మందికి జగనన్న ఇల్లులు వేయి కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణాలు చేపట్టినట్లు, డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నాటికి నూటా ఇరవై కోట్ల రూపాయలతో చేపట్టిన అమృత్ పధకం ద్వారా పట్టణ వాసుల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని, అక్టోబర్ 5న నిర్మాణం పూర్తి చేసుకున్న మూడు వాటర్ ట్యాంకులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయిదు కాలువల ఆధునీకరణ చేపట్టామని, యాబై యేండ్ల నాటి కూరగాయల మార్కెట్, ముప్పయ్ యేండ్ల నాటి బస్సు స్టాండ్ పునర్నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్ట బాలాజీ, అనిల్ కుమార్, యాల్లాల మహమ్మద్ గౌస్, షేక్ కమల్ భాష, గరిశపాటి లక్ష్మీదేవి, ఇర్ఫాన్ భాష, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజిని, రాగా నరసింహారావు, టీటీడీ పాలక మండలి సభ్యులు మారుతి ప్రసాద్, వైసిపి నాయకులు 40వ వార్డు ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, అగ్గరపు శ్రీనివాసులు, రామ్మోహన్ రెడ్డి, రాయపు రెడ్డి, కంభం పాములేటి, డీలర్ ఆంజనేయులు, ఆచారి కాలని శివారెడ్డి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments