వరికూటి అధ్యక్షతన 'ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే'
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వినియోగదారులుగా ప్రజలు వస్తువు కొనే సమయంలో ఎంతగా ఆలోచిస్తామో, అలా ప్రజల కోసం తాపత్రయపడే నాయకుడిని రానున్న ఎన్నికలలో ఎన్నుకోవాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మునిసిపల్ 4వ వార్డు, రెండవ సచివాలయం నందు ఆ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబులరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన 'ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టిడిపి నాయకులకు తాను సవాల్ చేస్తూ టిడిపి ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2019 వరకు నియోజకవర్గంలోని ఏ ఒక్క లబ్ధిదారుడికైనా చంద్రబాబు సెంటు భూమి ఇచ్చి ఉంటే తాను రానున్న ఎన్నికలలో నామినేషన్ ఉపసంహరించుకుంటానని సవాల్ విసిరారు. డిసెంబర్ 22వ తేదీ నాటికి నియోజకవర్గ జగనన్న కాలనీలలో నాలుగు వేల ఇల్లు నిర్మాణం చేసి గృహ ప్రవేశాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గతంలో చంద్రబాబును దూషించి, నేడు టిడిపి జెండాను భుజాన ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. నాలుగో వార్డ్ నందు దాదాపు 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా వై.ఎం.ఆర్ కాలనీ ఎంట్రెన్స్ నందు ఆర్చి నిర్మాణం, మున్సిపల్ కాంప్లెక్స్ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు దాదాపు 22 కోట్ల 52 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. అనంతరం వైఎంఆర్ కాలనీ లోని పెద్దమ్మ చెట్టు నాలుగు రోడ్ల కూడలి వద్ద వైసీపీ పార్టీ జెండాను ఎగురవేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైసీపీ రాష్ట్ర అదరపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద, వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments