553 వాహనాల వేలం .
2019 నుండి 2022 సం. ఇప్పటి వరకు అక్రమంగా మద్యం, సారా, గంజాయి తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న, జప్తు చేసిన మొత్తం 553 వాహనాలను వాహనాల వేలం నిర్వహించబడుతుందని వాహనాల వేలం గురించి కర్నూలు సెబ్ అడిషనల్ ఎస్పీ (జాయింట్ డైరెక్టర్) తుహిన్ సిన్హా ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
1) కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, (DTC) దిన్నెదేవరపాడు గ్రామం, జగన్నాథగట్టు దగ్గర కర్నూలు.
2) ఆదోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాలలో
వాహనాల వేలం నిర్వహించబడుతుంది.
2022 ఏప్రిల్ 4 వ తేది నుండి ఏప్రిల్ 7 వ తేది వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ఆయా పోలీస్ అధికారుల సమక్షంలో వాహానాల వేలం ప్రారంభమవుతుందని పాల్గొనదలచిన వారు తగు ధరావత్తు చెల్లించాలి.
వాహానాల వేలంలో పాల్గొనదలచిన వారు ఈ క్రింది షరతులు పాటించాలి.
1. పార్టిసిపేషన్ ఫీజు:రూ.3,000/- (వాపసు ఇవ్వదగినది) + ఆధార్ కార్డ్ (1 జిరాక్స్ కాపీ)
2. బిడ్డర్ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ మరియు అన్ని ఖర్చులను భరించాలి,
3. నిబంధనల ప్రకారం విక్రయం ద్వారా వచ్చే ఆదాయం పై వర్తించే విధంగా SGST & CGST చెల్లించాలి.
4. వేలం వేసిన వాహనంపై పెండింగ్‌లో ఉన్న MV చలాన్‌లను బిడ్డర్ మాత్రమే భరించాలి.
కర్నూలు , దిన్నెదేవరపాడు గ్రామం, జగన్నాథగట్టు దగ్గర ఉన్న కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (DTC) లో 280 వాహానాలను వేలంలో ఉంచనున్నారు.
ఇందులో …
ఏప్రిల్ 4 వ తేది 79 ద్విచక్రవాహనాలు.
ఏప్రిల్ 5 వ తేది 79 ద్విచక్రవాహనాలు.
ఏప్రిల్ 6 వ తేది 72 ద్విచక్రవాహనాలు .
ఏప్రిల్ 7 వ తేది 14 ఫోర్ వీలర్, 36 త్రీ వీలర్ వాహనాలు.
ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 273 వాహానాలను వేలంలో ఉంచనున్నారు.
ఇందులో…
ఏప్రిల్ 4 వ తేది 80 ద్విచక్రవాహనాలు.
ఏప్రిల్ 5 వ తేది 82 ద్విచక్రవాహనాలు.
ఏప్రిల్ 6 వ తేది 87 ద్విచక్రవాహనాలు .
ఏప్రిల్ 7 వ తేది 9 ఫోర్ వీలర్, 15 త్రీ వీలర్ వాహనాలు.
ఏదైనా సమాచారం కోసం SEB కంట్రోల్ రూమ్ 7993822444 నెంబర్ కి కాల్ చేయాలని ఈ వేలంలో ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్ విజ్ఞప్తి చేశారు.
Comments