-- 70 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీకి సిద్ధం.
మండలవ్యవసాయఅధికారిని రాజకుమారి.
భూమిలోని సత్తువను తిరిగి నింపేందుకు ఉపయోగించే పచ్చిరొట్ట విత్తనాల రకాలు చిట్వేలి మండల పరిధిలోని 13 రైతు భరోసా కేంద్రాలలో రేపటి రోజు నుంచి ( 16/5/2022 ) సబ్సిడీ పోను సగం ధరకే అందుబాటులో ఉంటాయని కావలసిన రైతులు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం తో తమ పంచాయతీ పరిధిలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి తమకు కావాల్సిన విత్తన రకాలను పొందవచ్చని, వీటి ధరలు జనుము రకం కేజీ మార్కెట్ విలువ 86 రూపాయలు ఉండగా సబ్సిడీ పోను 43 రూపాయలు, జీలగలు కేజీ 32 రూపాయలు, పిల్లి పెసర 44 రూపాయలకు అందుబాటులో ఉంటాయని. జనములు నిలువ క్వింటాల లో 57.7, జలగలు 9.3, పిల్లి పెసర 2.98 మొత్తం కలిపి సుమారు 70 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ ఆధికారిని రాజకుమారి తెలియ పరిచారు.
Comments