రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్‌సిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎన్ఏమ్ఆర్, టైమ్ స్కెల్ కార్మికులకు జరిగిన తీవ్ర అన్యాయంపై రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో మోకాళ్ళపై ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనువాసులురెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బాదుల్లా, టియన్ టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీను, జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్, మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు పెరిగాయంటే 8, 9, 10 పిఆర్‌సిల వల్లేనన్నారు. ప్రస్తుత11వ పిఆర్‌సిలో కార్మికులకు అన్యాయం జరిగిందని విమర్శించారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులందరికి కనీస వేతనం 26, 000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు లు ఆదేశించినా ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. పిఆర్‌సి సవరించి న్యాయం చేయకపోతే పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సుబ్బయ్య, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మద్దిలేటి, ఏఐటీయుసీ నగర అధ్యక్షులు సుబ్బరాయుడు, ఏపీ హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, విజయ కుమారి, భారతి, వైవియు హాస్టల్ వర్కర్స్ యూనియన్ గంగాధర్, టియన్ టియుసి రాష్ట్ర కార్యదర్శి మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments