కడప జిల్లా, పులివెందుల గ్రామ రెవిన్యూ సహాయకులకు కనీస వేతనం రూ. 21000/-లు ఇవ్వాలని, డిఎ తో కలిపి వేతనం చెల్లించాలని, నామినీలను విఆర్ఎలుగా నియమించాలని, పులివెందుల లోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరుగుతున్న రిలే దీక్షలు కామనూరు శ్రీనువాసులురెడ్డి ,సిఐటియు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలి. 65 సం॥లు దాటి చనిపోయిన విఆర్ఎ కుటుంబంలో కంపాసినేట్ గ్రౌండ్ క్రింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్స్ సాధన కోసం ఫిబ్రవరి 8 నుండి ఆందోళన జరుగుతుంది నేటికి 8 రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయని, అన్నారు
11వ పిఆర్సి నివేదికలో విఆర్ఎల వేతనాల పెంపుదల ప్రస్తావనే లేదు. రెవిన్యూ వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలకు పైగా విఆర్ఎలు పనిచేస్తున్నా వారి వేతనాల పెంపుదల ఊసేలేకపోవటం. అన్యాయం. రెగ్యులర్ ఉద్యోగ సంఘాల ఆందోళనా పోరాటాలలో విఆర్ఎలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలియజేస్తున్నారు. ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు జిల్లా కమిటి తెలియజేస్తున్నది. పిఆర్సి సాధన కమిటి నాయకత్వం విఆర్ఎల వేతనాల పెంపుదల విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని, తమ సమస్యలతో పాటు విఆర్ఎల కు న్యాయం జరిగేందుకు | చిత్తశుద్ధితో రెగ్యులర్ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకత్వం కృషి చేసి ఉంటే బాగుండేదన్నారు
ముఖ్యమంత్రిగారు విఆర్ఎలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదు. కేవలం రూ. 10,500/-లతో విఆర్ఎ కుటుంబాలు బ్రతకటం ఎంత కష్టమో ప్రభుత్వ పెద్దలకు తెలియనిది కాదు. రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి చర్చిస్తున్న ప్రభుత్వం విఆర్ఎల వేతనాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవాలని , ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పిఆర్సి సందర్భంగానే ఆ రాష్ట్రంలోని విఆర్ఎలకు 30 శాతం వేతనాలు పెంచింది. కాని మన రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎల సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం సరైంది కాదు.
ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా ఫలితం లేకపోవటంతో గత్యంతరం లేక ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఇచ్చిన డిఎ ను వేతనం నుండి రికవరీ చెయ్యటం దుర్మార్గం. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతరభృతి తిరిగి రికవరీ చేయరాదని స్పష్టంగా చెప్పింది. ఇదే న్యాయం విఆర్ఎల డిఎ రికవరీ విషయంలో కూడా వర్తిస్తుంది. కావున ప్రభుత్వం తక్షణం డిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకొని డిఎతో కూడిన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఎల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం జరుగుతున్న దశల వారీ ఆందోళనలను సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు, జయప్రదం చెయ్యాలని అన్నారు కార్యక్రమంలో బయన్న, ప్రభాకర్, గంగాధర్, హరి, మేరిమ్మ, నూర్జహాను, మణిలక్మి, సుజాత, దినకుమారి, బాబు, మోహన్, గంగరాజు, గంగన్న, ప్రసన్న లక్మి తదితరులు పాల్గొన్నారు.
Comments