top of page
Writer's pictureEDITOR

కార్మిక హక్కుల రక్షణకై నిరంతర పోరాటం - సిఐటియు

కార్మిక హక్కుల రక్షణకై నిరంతర పోరాటం - సిఐటియు

గాజువాక, ప్రసన్న ఆంధ్ర


కార్మిక హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేయాలని సిఐటియు జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం జగ్గ నాయుడు పేర్కొన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ యూనియన్ ఆఫీసులో ప్రారంభమైన కార్మికుల రెండు రోజుల శిక్షణ తరగతులు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్పీడ్ గా కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్స్ ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేస్తుందని, అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు సొంత గనుల కేటాయించకుండా ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ కు ఆర్థికంగా ఆదుకోవాల్సింది పోయి స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. నేషనల్ మానిటైజేషన్ ఆఫ్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు అదానీ పరమైందని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ను కూడా అదానీ కు కట్టబెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు.


రాజధాని,పొలవరంప్రాజెక్ట్ నిర్మాణం కోసం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలని ఒత్తిడి తేవాలన్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటుపరం కాకుండా బిజెపి ప్రభుత్వంతో ప్రకటన చేయించాలన్నారు. ఈ రెండు రోజుల శిక్షణా తరగతులకు సిఐటియు జిల్లా కోశాధికారి జ్యోతీశ్వరావు ప్రిన్సిపల్ గాను స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపాల్ గాను వ్యవహరించారు. ఈ శిక్షణా తరగతులకు ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్, బిహెచ్ఇఎల్, హెచ్ఎస్ఎల్, హెచ్పిసిఎల్, పోర్ట్ ట్రస్ట్, మున్సిపల్ రంగాలతోపాటు స్కీం వర్కర్స్ అయిన ఆశ, అంగనవాడి, మధ్యాహ్నం భోజనం పథకం, ముఠా, బిల్డింగ్,ట్రాన్స్ పోర్ట్, హాస్పిటల్స్ తదితర రంగాల నుండి సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్, కార్యదర్శులు జగన్ అప్పలరాజు, పి.మణి, వెంకట రెడ్డి, కుమార్ మంగళం, శ్రీనివాసరాజు, నమ్మి రమణ, సుబ్బారావు, అప్పారావు, Rsnమూర్తి తదితరులు పాల్గొన్నారు.


36 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page