నిన్నటి రోజున పత్రికాలో ప్రచురితమైనటువంటి "మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామం చెందిన అనాధలను ఆదుకోండి "అనే కథనానికి ఏపీ ఎమ్మార్పీఎస్ సంఘం తరుపున స్పందించడం జరిగింది.."మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షుడు నేపాల్ మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు పందికోన ఈరన్న ఆధ్వర్యంలో కల్లుదెవకుంట గ్రామానికి చెందిన బోయ కర్రీ రాములమ్మ W/o బోయ ఆంజనేయ రెండవ సంతానమైనటువంటి బోయ నరసింహులు ఆయన భార్య ఈరమ్మ వీరిద్దరు అకాల మరణం చెందడంతో వీరికి కలిగినటువంటి సంతానమైన ఉలిగమ్మ మరియు రమేష్ అనాధలుగా మారటం జరిగింది. మానవ సేవే మాధవసేవ అని తలచి ఏపీ ఎమ్మార్పీఎస్ నుండి పది వేల రూపాయల-10000 ₹ ఆర్థిక సహాయాన్ని వారికి అందజేసి ఏపీ ఎమ్మార్పీఎస్ సంఘం తన దాతృత్వాన్ని చాటుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షుడు నేపాల్ మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు పందికోన ఈరన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో లో వివిధ పరిస్థితుల దృష్ట్యా మరియు అ దేవుడు విధి ఆడిన వింత నాటకంలో తమ జీవితాన్ని చాలించడం జరిగింది.వీరికి కలిగినటువంటి సంతాన మైనటువంటి ఉల్లిగమ్మ రమేష్ .ఇంటిపెద్ద దిక్కులను కోల్పోవడంతో కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఏర్పడడం జరిగింది.అయితే వీరి పోషణ మరియు ఆలనాపాలనా వీరి నానమ్మ రాములమ్మ మీద భారం గా మారడం జరిగింది. అల్లారుముద్దుగా పెరగాల్సిన టువంటి వయసులో తన తమ్ముడి చదువు నిమిత్తం ఉలిగమ్మ పనికి వెళ్లడం గ్రామస్తులు అందరిని మానవత్వం కలిగినటువంటివారి హృదయాలను కలచి వేయడం జరిగింది.కాబట్టి మంత్రాలయం నియోజకవర్గం మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గం లో ఉన్నటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి పెద్దలు మరియు వివిధ హీరోల అభిమాన సంఘాల నాయకులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు కుల రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా స్పందించి. నిరాశ్రయులగా మారిన ఇటువంటి కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నుండి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డేవిడ్ యాకోబు దివాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
top of page
bottom of page
Comments