ఎన్ సి సి విద్యార్థులకు ఏ (A) గ్రేడ్ సర్టిఫికెట్ల ప్రధానోత్సవం - క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్న హెచ్ఎం కృష్ణమూర్తి, ఎన్ సి సి అధికారి పసుపుల రాజశేఖర్.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ సి సి క్యాడేట్ లకు.. 30 ఆంధ్రా బెటాలియన్ ఎన్ సి సి అధికారుల ఆదేశాల మేరకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ధృవ పత్రాలను ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.కృష్ణమూర్తి మరియు ఎన్ సి సి అధికారి పసుపుల రాజశేఖర్ ప్రధానోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ఐక్యత లు కలిగినప్పుడే వారిలో దేశభక్తి పెంపొంది ఉజ్వల భవిష్యత్తు పొందడానికి సాధ్యపడుతుందన్నారు.
ఎన్ సి సి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ 2019 -2021 బ్యాచ్ ఎన్ సి సి క్యాడేట్ ల ఏ(A) సర్టిఫికెట్ పరీక్షకు 45 మంది హాజరు కాగా వీరిలో 34 మంది ఏ గ్రేడ్ 11 మంది B గ్రేడ్ సాధించారన్నారు. ఈ సర్టిఫికెట్ పొందిన వారు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ పొందవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రయ్య, చిన్న బాబు, కిరణ్ కుమార్ రాజు మరియు ఎన్ సి సి విద్యార్థులు పాల్గొన్నారు.
Comments