top of page
Writer's picturePRASANNA ANDHRA

ఆలమూరు మండలాన్ని, రాజమహేంద్రవరం జిల్లాలో ఉంచండి - రాయుడు లక్ష్మణ్

తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలంను, రాజమహేంద్రవరం జిల్లాలోనే కొనసాగించాలని, ఈ సమస్యను పరిష్కరించి, ఆలమూరు మండల ప్రజలు, వృద్ధులు, మహిళలు, యువత సాధకబాధకాలను అర్థం చేసుకుని, విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు, దివ్యాంగుల పట్ల పెద్ద మనసుతో వారి బాధలను, తమరు దయతో అర్థం చేసుకుని, రాజమహేంద్రవరం జిల్లా లోనే ఆలమూరు మండలంను, కొనసాగించాలని, అమలాపురం వద్దు!- రాజమండ్రి ముద్దు! అనే నినాదంతో ప్రజలు కోరుతున్నారని, అమలాపురం జిల్లా కోనసీమ ప్రాంతానికి, ఆలమూరు మండలంలోని ప్రజలు వెళ్లాలంటే 60 పైగా కిలోమీటర్లు ప్రయాణించ వలసిన ఉంటుందని, ఎంతో వ్యయప్రయాసలతో, ఆర్థిక భారంతో కూడుకున్నదని, పేద మధ్యతరగతి వారి ప్రయాణించాలంటే ఆర్థికంగా సామాన్యులు నలిగిపోతారని, ఆలమూరు మండలంనకు అతి సమీపంలో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా అయితే, ఆలమూరు మండల వాసులకు అన్ని విధాలా శ్రేయస్కరమని, రెండు పర్యాయాలు ఆలమూరు మండల ప్రజలు చిర్ల జగ్గరెడ్డి ని ఎమ్మెల్యేగా ఓట్లు వేసి గెలిపించినoదులకు, ఆలమూరు మండల ప్రజల రుణం తీర్చుకునే సమయం చిర్ల కి ఇప్పుడు వచ్చిందని, ఈ సమస్యను పరిష్కరించగల ఏకైక వ్యక్తిగా, ఒక్క చిర్ల జగ్గిరెడ్డి కి మాత్రమే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ఆలమూరు మండల ప్రజలు తమ రుణం తీర్చుకుంటారని తెలియజేశారు. ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డు చెప్పరని, ఈ విషయమును పెద్దమనసుతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేయమని ప్రాధేయపడి కోరుతున్నాము అని ఆలమూరు మండల ప్రజల తరఫున కోరుతున్నాను అని రాయుడు లక్ష్మణ్ రావు తెలిపారు.


81 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page