నేను వచ్చాకే అభివృద్ధి జరిగింది - ఎమ్మెల్యే రాచమల్లు
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కొత్త ఫీచర్లతో రూపొందించబడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను ప్రొద్దుటూరు మున్సిపల్ ఒకటో వార్డు, 1వ సచివాలయ పరిధిలో శుక్రవారం సాయంత్రం కౌన్సిలర్ పి. సరోజమ్మ, వార్డు ఇంచార్జి పోరెడ్డి నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాజరై ప్రజలకు స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి 25 లక్షల రూపాయలు విలువ చేసే వైయస్సార్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయటం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం తాను ఎమ్మెల్యే అయ్యాక దౌర్జన్యాలు, అన్యాయాలు, హింసను ప్రేరేపించినట్లు నిరూపిస్తే క్షమాపణ చెబుతానని, తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇవి టిడిపి నాయకులకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు? తమ ప్రభుత్వం వలన మేలు జరిగిందని ప్రజలు ప్రశంసలు కురిపిస్తుంటే, టిడిపి నాయకులు మాత్రం విమర్శలు చేస్తూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నారని అన్నారు. తన హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగి ఉంటేనే తనకు ఓటేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ఒకటవ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments