వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు నందు వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆలయ, ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, గత రెండు రోజుల క్రిందట తెల్లకుల మనోహర్ చేసిన వ్యాఖ్యలను ఆలయ, ఆర్యవైశ్య సభ్యుల కమిటీ ముక్తకంఠంతో ఖండించింది.
ఈ విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ మాట్లాడుతూ తెల్లకుల మోనోహర్ చేసినవి అనుచిత వ్యాఖ్యలని, ఆర్యవైశ్య సభనుద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు, గతంలో మనోహర్ తండ్రి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసి పట్టణంలోని ఆర్యవైశ్యులకు ఇరవై పైసాలు లెక్కన దామాషా కట్టించి ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. ముందుగా ఆనాడు అప్పులు ఇచ్చి నష్టపోయినవారికి తగు న్యాయం చేయాలని కోరారు. అమ్మవారికి సేవ చేయటానికే తాము ఇక్కడున్నామని, రాజకీయాలు తమకు తగవని హితువు పలికారు. గతంలో అనగా 2010లో మనోహర్ ఆర్యవైశ్య సభ నుండి భహిష్కరించబడ్డారని, తానే లిఖితపూర్వకంగా చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ ఆనాడు రాజీనామా చేశారని, త్వరలో డిఫరేమేషన్ వేసి చట్టబద్ధమయిన చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఆర్యవైశ్య సభ ఉన్నతిని కాపాడటానికి తామంతా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఆర్యవైశ్య సభ సెక్యూరిటీ సోషల్ వెల్ఫేర్ కన్వినర్ సి.వి సురేష్ మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి ఆలయ నాలుగు స్థంబాల నడుమ ఆర్యవైశ్య కులస్థుల ఎన్నో సమస్యలు తాము తీర్చామని, అవివేకులే ఈ సభ గురించి తప్పుగా మాట్లాడతారని, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రొద్దుటూరు లోని ఆర్యవైశ్యులు అందరికి చేప్పపేరు ఆపాదించటమేమిటని ప్రశ్నించారు.
ఆర్యవైశ్య సభ లీగల్ అడ్వైసర్ మధుసూదన్ మాట్లాడుతూ, 1926వ సంవత్సరంలో పదమూడు మంది ఆర్యవైశ్యులతో సభను ప్రారంభించి ఆర్యవైశ్య అభివృద్ధి కోసం పాటుపడుతోందని, నేడు అయిదు వేల మంది సభ్యలు ఉన్నారని, ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారనటం అవాస్తవమని తెలిపారు. అమ్మవారికి ఆర్యవైశ్య దాతలు భక్తులు ఇచ్చిన విరాళాలు, బంగారు నగలపై సభకు గాని సభ్యులకు గాని ఎటువంటి అధికారాలు లేవని, ప్రతి రూపాయి జామా ఖర్చులు సభ్యులకు పారదర్శకంగా వివరించటం జరుగుతుందని, అలాంటిది వీటిని అమ్మి పాఠశాలలు, హాస్పిటళ్లు కట్టించటమేమిటని మండిపడ్డారు. త్వరలో మనోహర్ పై చట్టపరమయిన చర్యలు చేపట్టనున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇకపోతే తెల్లాకుల మనోహర్ సోదరులయిన తెల్లాకుల సుబ్రహ్మణ్యం, శివ ప్రసాద్, కిరణ్ కుమార్ విడిగా మరో విలేకరుల సమావేశం అమ్మవారిశాల నందు గల కళ్యాణమంటపం నందు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన సోదరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ పై ఆరోపణలు చేసిన వ్యక్తి తమ సోదరుడు కాబట్టే తాము వివరణ ఇస్తున్నామని, తమ సోదరుడికి ఎందుకు ఇలా చేస్తున్నాడో తమకు అర్థం కావటం లేదని, 130 సంవత్సరాల ఆర్యవైశ్య సభ చరిత్రలో ఇలాంటి ఆరోపణలు ఎన్నడూ ఎదుర్కోలేదని, వ్యక్తిగత సమస్యలను సభకు ఆమోదించటం సబబు కాదని హితువు పలికారు.
Comments