కోటిపల్లి జీళ్ళ గురించి తెలుసా?
తూర్పు గోదావరి జిల్లాలో పలు రకాల తినుబండారాలకు ప్రసిద్ధి. ఆత్రేయపురం పూతరేకులు , తాపేశ్వరం మడత కాజా, కోనసీమ పొట్టుంగ బుట్టలు, రాజమండ్రి రోజ్ మిల్క్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి కోవలోకే వస్తుంది కోటిపల్లి జీళ్లు అయితే ఇవి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కేవలం శివరాత్రి సమయంలో మాత్రమే దొరుకుతాయి.
సుమారు 140 ఏళ్ల నుంచి కోటిపల్లి గ్రామానికి చెందిన యాళ్ళ కుటుంబం అక్కడ జీళ్ళ దుకాణం చేస్తోంది. తరతరాలుగా తమకి ఈ వ్యాపారం ఒక వృత్తి గా మారిందని దాన్ని ఆపలేక కొనసాగిస్తున్నామని , ఈ సంప్రదాయాన్ని మా తర్వాత కూడా కొనసాగేలా మా పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం అని యాళ్ళ కుటుంబీకులు చెబుతున్నారు.
కోటిపల్లి సాగే జీడీ ఒకటైన రుచి చూడాలని గోదావరి జిల్లా ప్రజలే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశపడతారు. తయారీలో ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఇవి కనీసం మూడు రోజులైనా ముక్కి పోకుండా సాగుతూ ఉంటాయి.
ప్రస్తుతం జీడీ ధరలు పెరిగిపోవడం వల్ల జీళ్ళ ధర కూడా పెంచాల్సి వస్తుంది అని చెబుతున్నారు. లాభాల కోసం కాకుండా అందరికి జీళ్ళ రుచి చూపించాలనే ఉద్దేశం తో దుకాణాలు పెడతామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి శివరాత్రి కి కోటిపల్లి వైపు వెళ్తే మీరు కూడా ఈ జీళ్ళ రుచి చూడండి.
Comentários