చిత్తూరు జిల్లా, మహిళా రైతు నుండి 3 వేలు లంచం తీసుకుంటున్న మాపాక్షి విఆర్వో నౌజీయా తిరుపతి ఏసిబి డి ఎస్ పి జనార్దన్ నాయుడు రెడ్ హ్యాండెడ్ గా శుక్రవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు రూరల్ మండలం మాపాక్షి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన మూడు ఎకరాల భూమికి సంబంధించి 1 బి కావాలని మాపాక్షి విఆర్ఓ నౌజీయాను సంప్రదించగా మూడు వేల రూపాయలు లంచం ఇస్తేనే ఏర్పాటు చేస్తానని చెప్పడంతో, బాధితురాలు వెంటనే తిరుపతి లోని ఏసీబీ అధికారులను సంపాదించింది. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం భారతి తన పింఛను డబ్బుతో వి ఆర్ ఓ నౌజీయా కు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీని పైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడుల్లో సీఐ ఈశ్వర్, తమీమ్ అహ్మద్, వెంకట్ నాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ, మహిళా పోలీసు ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments