ట్యాంక్ బండ్ పైన BMW కారు అదుపు తప్పింది . ఈ కారు ప్రమాదంలో ఇన్స్పెక్టర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అర్ధరాత్రి సమయంలో టాంక్ బండ్ పైన డ్యూటీ నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిడ్ నైట్ సమయంలో ట్యాంక్ బండ్ పైన జహంగీర్ డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ కారు ఒక్కసారిగా అత్యంత వేగంగా టాంక్ బండ్ పై దూసుకు వచ్చింది. ఈ సమయంలో ఇన్స్పెక్టర్ ను ఢీకొంటూ కారు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆయన కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి, కారులోని వ్యక్తులు మద్యం మత్తులో ఉండగా, కారులో బయట పడ్డ మద్యం నింపిన కొబ్బరి బోండాలు.
top of page
bottom of page
Comments