బెనర్జీ హత్యాయత్నం కేసులో ముద్దాయిల అరెస్ట్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడైన బెనర్జీ పై అక్టోబర్ నెలలో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలైన భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను శనివారం ఉదయం మూడవ పట్టణ ఇన్స్పెక్టర్, సిబ్బంది అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డిఎస్పి నాగరాజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తరచుగా ఇరు పార్టీల నాయకులు పాత్రికేయుల సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాలలో మాటలు తారాస్థాయికి చేరటం వలన, బెనర్జీ పలుమార్లు ముద్దాయిలను బెదిరించినట్లు, పథకం ప్రకారం సాధికార సామాజిక బస్సుయాత్ర ను అదును చేసుకుని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ రోడ్డుపై బెనర్జీని ముద్దాయిలైన రామ్మోహన్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డిలు అతని బైకును ఢీ కొట్టి, అందుబాటులో ఉన్న కొడవలితో దాడి హత్యా ప్రయత్నం చేసి ఆపై బైకుపై పరారయ్యారని వెల్లడించారు. శనివారం ఉదయం వీరి అరెస్టును ధ్రువీకరించిన డిఎస్పి, భరత్ కుమార్ రెడ్డి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు రెండు సిమ్ కార్డులు, రామ్మోహన్ రెడ్డి వద్ద నుండి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారం తెలుసుకునేందుకు నిందితులు సెల్ఫోన్లు సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. రాయచోటికి చెందిన సిద్ధారెడ్డి అనే వ్యక్తి అలాగే మరికొందరు ముద్దాయిలకు సహకరించి వారికి వాహనాలు, ఆర్థిక సాయం చేసినట్లు తమ విచారణలో తేలిందని, త్వరలో వారిని కూడా విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ అలాగే సిబ్బందిని డిఎస్పీ నాగరాజు అభినందించారు. అలాగే ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
Comments