కర్నూలు జిల్లా, రాయలసీమ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కూడలి నందు 100 మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మహాధర్నా కార్యక్రమం చేశారు. ఈరోజు మంత్రాలయం లో రాయలసీమ ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో స్టూడెంట్ విద్యార్థులను కలుపుకొని ఎంపీడీవో ఆఫీస్ నుండి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని బలమైన శ్లోకాలు ఇచ్చారు.ఈ సందర్భంగా రాయలసీమ ప్రజా సంఘాల కన్వీనర్లు నాగన్న ,రామతీర్థ అమ్రేష్, ఖాజా, కృష్ణ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదోని డివిజన్ లో ఉన్న నాలుగు తాలూకాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక,విద్య, వైద్య ఎదుగుదల కోసం ఆదోని జిల్లాగా ఏర్పాటు చేస్తే వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రకటించబడుతాయి,నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి, అలాగే కలెక్టర్ ఆధ్వర్యంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు, ఆలూరు ,కౌతాళం,పెద్దకడుబూర్ మండలాల ప్రజలు వైద్య సౌకర్యం కోసం జిల్లాకు వెళ్లాలంటే 130 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది .అందుచేత ఇక్కడి ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించుకొని ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్షరాస్యతలో వెనకబడిన ప్రాంతం, వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతము, భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతం మన ఆదోని డివిజన్ కాబట్టి ఆదోని జిల్లానుతక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు గర్జి. హనుమన్న మాదిగ, ఆర్ఏవిఎఫ్ నాయకులు మోషే, వెంకటేష్, మోహన్, దస్తగిరి, విద్యార్థి సంఘ నాయకులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comentarios