అగనంపూడి సెక్షన్ కార్యాలయం సందర్శించిన ఆర్ ఈ సి ఎస్ ఇంచార్జ్ ఏపీ ఈ పి డి సి ఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలాకి శ్రీనివాస్.
ఏపీ ఈపీడీసీఎల్ లో ఆర్ఇసిఎస్ విలీనం అయిన తర్వాత ప్రప్రధమంగా అగనంపూడి ఆర్ఇసిఎస్ సెక్షన్ కార్యాలయమునకు పి శ్రీనివాస్ విచ్చేసిన సందర్భంగా అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ టిడిపి నాయకులు నెల్లి శ్రీనివాసరావు వైయస్సార్ సిపి నాయకులు సాయిన సన్యాసిరావు ఉక్కు కార్మిక నాయకులు మంత్రి మురళి టిడిపి ఎస్సీ సెల్ నాయకులు కత్తి ప్రదీప్ చంద్ అభినందించారు.
పోలాకి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే మా ధ్యేయమని వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది చూసుకోవాలని తక్షణమే ఆర్ ఈసీ ఎస్ బోర్డు మార్చి ఏపీ పి డి సి ఎల్ బోర్డులు పెట్టాలని ప్రతి స్టేషనరీ ఏపీ ఈపీడీసీఎల్ నే వాడాని ఆదేశించారు.
బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్ ఇ సి ఎస్, ఏ పి ఈ పి డి సి ఎల్ లో విలీనం అయినందున స్థానిక విద్యుత్ వినియోగదారులకు సోలార్ సౌకర్యము ,పేదవారికి దీనదయాళ్ విద్య జ్యోతి పథకం అమలు పరచాలని ఆర్ ఇ సి ఎస్ సభ్యుల షేర్ కాపిటల్ సభ్యులకు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లో ఆర్ ఇ సి ఎస్ ఏ డి లు ప్రసాద్, కనకారావు అకౌంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు, లైన్ ఇన్స్పెక్టర్ లో సురేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు
అనంతరం పి శ్రీనివాస్ సెక్షన్ కార్యాలయము సందర్శించి వారి చేసే పని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments