అగనంపూడి పునరావాస కాలనీ సెక్టర్ 3 స్టార్ డం స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విద్యకు, విజ్ఞానానికి మూలవిరాట్ శ్రీ సరస్వతిదేవి విగ్రహానికి ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ పూలమాలవేసి అనంతరం మాట్లాడుతూ వివిధ దేశాల ప్రాంతాల ప్రజలు మనో అభిప్రాయాలను కాపాడుకోవడానికి వారి భాష సంస్కృత వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరపాలని తీర్మానించింది. ఉద్యోగరీత్యా ప్రస్తుతం అందరూ ఇంగ్లీషు మీడియం చదువుతున్నప్పటికీ మన తెలుగుభాష ఔన్నత్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు.
స్టార్ డం స్కూలు కరస్పాండెంట్ ఎస్ రంగారావు మాస్టర్ సభాధ్యక్షుతన జరిగిన కార్యక్రమంలో అగనంపూడి హార్టికల్చర్ సొసైటీ అధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు ,సిడబ్ల్యూసి కార్యదర్శి వంకర రాము, అగనంపూడి ఉన్నత పాఠశాల ఎస్ఎంసి డైరెక్టర్ సింగిడి సింహాచలం, ఉక్కు కార్మిక నాయకులు అలమండ శ్రీనివాసరావు స్థానిక నిర్వాసిత నాయకులు దానబాల పైడికొండ, ముచ్చు అప్పలరాజు, రాంజీ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి కత్తి ప్రదీప్ తిలక్ స్కూలు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
Comentarios