అగనంపూడి పునరావాస కాలనీ కొండయ్యవలస గ్రామం పి ఆర్ ఏ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జీవీఎంసీ 78, 79 ,85 ,86 ,87 ,88 వార్డుల్లో కలుపుకొని అగనంపూడి కేంద్రముగా మండల ఏర్పాటు చేయాలి అన్నారు.
ప్రజావేగు పట్టా రామా అప్పారావు మాట్లాడుతూ ఫిబ్రవరి 28న అగనంపూడి ఆర్ ఈ సి ఎస్ సెక్షన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగిన నాటి నుండి నేటి వరకు ఆర్ ఇ సి ఎస్ పర్సన్ ఇంచార్జ్ శ్రీమతి శ్యామల, ఆర్ ఇ సి ఎస్ డిపిఇ జుత్తాడ ప్రసాదు ఎక్కడ అడ్రస్ లేరని ఏఈ ,లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అరెస్టు చేసి జైల్లో ఉన్నారని ఇప్పటివరకు నూతన ఏఇని లైన్ ఇన్స్పెక్టర్న ఆస్థానములో కొత్త కొత్తవారిన వేయకపోవడంతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బంది గురవుతున్నారు గతంలో ఆర్ ఇ సి ఎస్ నెలవారీ బిల్లింగ్ ఐదు కోట్లు వస్తే ఏపీ ఈపీడీసీఎల్ లో బిల్డింగ్ సుమారు తొమ్మిది కోట్లు వస్తున్నది ఈ పై వ్యత్యాసం పై పర్సన్ ఇంచార్జ్ శ్యామల, డిపిఇ ప్రసాదు శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ నాయకులు పామల వసంతకుమార్ మాట్లాడుతూ ఇటీవల గాజువాక మున్సిపల్ కార్యాలయంలో జీవీఎంసీ మేయర్ ,కమిషనర్ సమక్షంలో కాఫీ టు కార్పొరేటర్ సమావేశం జరిగిన ఆ సమావేశంలో కార్పొరేటర్లు కాఫీ తాగి వచ్చారా తప్ప విశాఖ నగర నగర ప్రజలకు ఆర్థిక ఇబ్బంది కలిగిస్తున్న అగనంపూడి టోల్ గేటు విషయం చర్చించి కమిషనర్తో హామీ తీసుకో పోవడంలో కార్పొరేట్లు వైఫల్యం చెందారని అన్నారు.
విశాఖ జిల్లా లైన్స్ క్లబ్ పర్సనల్ ఇంచార్జ్ కడిమి హనుమంతరావు సభాధ్యక్షత జరిగిన సమావేశంలో వైయస్సార్ సిపి నాయకులు తోకాడ రాము, బిజెపి నాయకులు మాచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు కరణం జగదీష్ ,గాంధీజీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చిత్త రామారావు, ఉక్కు నిర్వాసితుల యూత్ నాయకులు దానాబాల త్రిమూర్తులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments