అగనంపూడి ప్రసన్న ఆంధ్ర విలేఖరి
అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛ సర్వేక్షణ పై అవగాహన సదస్సు, ముఖ్య అతిథిగా జీవీఎంసీ గాజువాక జోన్ ఏ.ఎమ్.ఓ.హెచ్ డాక్టర్ ఆర్.ఎస్ కిరణ్ కుమార్
అగనంపూడి జూనియర్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విశాఖ నగరం స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రధమ స్థానం రావడానికి కాలేజీ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు, తడి చెత్త పొడి చెత్త, ప్లాస్టిక్ వాడకం నిరోధించాలి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన చేసితిరి విద్యార్థులంతా తమ మొబైల్లో నుండే పై అంశాలపై ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రానికి మలేరియా నిరోధకం పై చేస్తున్న పనులు ప్రశంసించి నేడు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందజేయుచునది. మన ఇంటి వద్ద పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బోండాలు,టైర్లో , ఫ్రిజ్, పూల కుండీల కింద ప్లేట్ లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ఉత్పత్తి పెరిగి మలేరియా వ్యాపిస్తుందని కావున పైన పేర్కొన్న సామానులు వద్ద నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని అన్నారు. అనంతరం క్లాత్ సంచులు, స్వచ్ఛ సర్వేక్షణ కరపత్రాలు ఆవిష్కరించారు.
గాజువాక జోన్ శానిటరీ సూపర్వైజర్ బీవీ రామారావు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ వి సుశీల కుమార్, ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ,మహిళా మండలి నాయకురాలు శ్రీమతి కొమ్మినేని లక్ష్మీ ప్రసన్న, కాలేజీ అధ్యాపకులు దివ్య, అనూష, రేవతి, ప్రదీప్ సచివాలయాల పర్యావరణ, శానిటరీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
Komentáře