అగనంపూడి ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, అగనంపూడి సి డబ్ల్యూ సి లో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టి ఎన్ టి యు సి అధికార ప్రతినిధి సత్యనారాయణ ప్రసంగిస్తూ నాలుగు దశాబ్దాల చరిత్ర గల ఆర్ఇసిఎస్ ను ఇటీవల ఏపీ ఈపీడీసీఎల్ విలీనం చేస్తున్నట్టు బిల్లు కూడా ఏపీ ఏపీఈ పి డి సి ఎల్ పేరుమీద వస్తున్నాయి మళ్లీ కోపరేటివ్ అధికారి శ్రీమతి ఎం శ్యామలని ఆర్ ఈ సి ఎస్ కి పర్సన్ ఇన్చార్జిగా పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు అనకాపల్లి ఎంపీ, ఎలమంచిలి, గాజువాక ఎమ్మెల్యేలు ఆర్ ఈ సి ఎస్ ని ఏపీ ఈపీడీసీఎల్ విలీనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు నేడు బహిరంగంగా పత్రికలో వచ్చినది ఆర్ ఇ సి ఎస్ లో 65% గ్రేటర్ సిటీలో కలిసిపోయింది, కేవలం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఒక్కరే ఆర్ ఈ సి ఎస్ కోపరేటివ్ సంస్థలో నడవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉన్నది నిజముగా ఆర్ఇసిఎస్ విద్యుత్ వినియోగదారుల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మహాజన సభ ఏర్పాటు చేసి సభ్యుల షేర్ క్యాపిటల్, ఆర్ఈసిఎస్ ఉద్యోగుల భద్రత, పాలిటెక్నిక్ అంశాలపై ఆర్ ఈ సి ఎస్ సంస్థ ఏపీ ఈ పీ డి ఎస్ ఎల్ లో వీలునామా లేక కోపరేటివ్ సంస్థలో నడవల సభ్యులు అభిప్రాయాన్ని తీసుకోవాలని బలి రెడ్డి డిమాండ్ చేశారు.
విశాఖ పార్లమెంటు నియోజకవర్గం టిడిపి కార్యదర్శి గంతకోరు అప్పారావు మాట్లాడుతూ కార్పొరేటర్ ఎన్నికలు జరిగితే ప్రజలకు ఏదో ఉద్దరిస్తారు అనుకుంటే గెలిచిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఇంటి పన్ను, చెత్త పన్నులు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారు 85 వ వార్డు కార్పొరేటర్ కి కేటాయించిన ఒక కోటి యాభై లక్షల రూపాయలు అగనంపూడి పునరావాస కాలనీ లో ఏ అభివృద్ధి పనులకు కేటాయించారని శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి ఆర్గనైజింగ్ కార్యదర్శి నెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవీఎంసీ 77, 79, 85, 88 వార్డులను విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని కోరారు
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి అధికార ప్రతినిధి కసేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని పరిశ్రమల్లో, ఇతర సంస్థలలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇస్తామని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ ఎక్కడా అమలు జరగడం లేదని స్థానిక హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తపరిచారు
సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మొల్లి కోటేశ్వరరావు సభాధ్యక్షతన జరిగిన సమావేశంలో జీవీఎంసీ 85 వ వార్డు తెలుగుదేశం పార్టీ, అనుబంధ సంస్థ నాయకులు ఎదురు గౌరీ ,వంకర రాము, అలమండ శ్రీనివాసరావు ,ఈగల నర్సింగరావు, బోని అప్పలనాయుడు, కత్తి తిలక్ ప్రదీప్ చంద్, కే దుర్గారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగాలు, ఉపాధ్యాయులు న్యాయమైన హక్కుల గురించి చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
Comentarios