top of page
Writer's picturePRASANNA ANDHRA

ఉద్యోగాలు అడిగితే అక్రమ అరెస్టులా - ఏఐఎస్ఎఫ్

రాయచోటి కడప జిల్లా, జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున కడప కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఈనెల 10వ తేదీన పిలుపునివ్వడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాయచోటి అర్బన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని ఇలా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడం ద్వారా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల లవకుమార్ ఏరియా కార్యదర్శి కిరణ్ కుమార్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అడిగితే అక్రమ అరెస్టులు చేయడం విడ్డూరం అన్నారు. పరిపాలన అధికారులు లేకుండా ప్రభుత్వం ఏ విధంగా సంపూర్ణమైన పరిపాలన అందిస్తుంది అని అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఉద్యోగస్తులకు పదవీ విరమణ వయసు 62 చేయడం హాస్యాస్పదం అన్నారు. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిరుద్యోగుల శాతం తారా స్థాయికి చేరే అవకాశం ఉంది కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనులు తెరిసి విద్యార్థి యువకుల కి ఖాళీగా ఉన్న స్తానలలో ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


6 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page