విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
సైన్స్ ఎడ్యుకేషన్ పై జాతీయ మెడికల్ కమిషన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గుజ్జుల వలరాజు
ప్రొద్దుటూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఉదయం అఖిల భారత విద్యార్థి సమాఖ్య పట్టణ సమితి సమావేశం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జీ వలరాజు సిపిఐ నాయకులు సుబ్బరాయుడు హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఫాసిస్టు ద్వారా అన్నిటిని విద్యావ్యవస్థ లోనికి పంపుతున్నదని అందులో భాగంగా మొదట అశాస్త్రీయ భావాలకు అద్దం పడుతున్న నూతన జాతీయ విద్యా విధానం 20 20 ని అమలు చేస్తూ తరువాత వైద్య రంగానికి సంబంధించి మెడికల్ విద్యలో ఇంటర్ జీవశాస్త్రం చదవకపోయినా ఎంబిబిఎస్ కు అర్హులేనని ఇవ్వడం , దీనికి మేధావులు గా జాతీయ మెడికల్ కమిషన్ ఆమోదం తెలుపుతూ తీర్మానించడం విడ్డూరం గా ఉందని అన్నారు. ప్రత్యేకంగా వైద్య విద్యను దాని ప్రమాణాలను దెబ్బతీసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునుకున్నాయని రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లను ఏ,బీ,సీ కేటగిరీలతో ధనార్జన ప్రధానంగా చేయడం, యూనివర్సిటీ గ్రాండ్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలలో యూనివర్సిటీల యొక్క స్థాయి ప్రమాణాలు , విలువలు, పూర్తిగా విధ్వంసం చేస్తున్నదని, అన్నారు ప్రొఫెసర్ పోస్టుల భర్తీ విషయంలో సరైన రోస్టర్ పాటించకపోవడం అనేక సమస్యలకు దారితీస్తున్నదని అదేవిధంగా పాలక మండల సభ్యులను కూడా పార్టీ అనుయాయులు ను నియమించుకుంటూ, సామాజిక సాధికార యాత్ర చేపడుతున్న ప్రభుత్వం ఇది అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రాథమిక విద్య మొదలు ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ అన్ని రంగాలలో విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి, వసతి దీవెన విద్యా దీవెన, వంటి చేతి మార్పిడి పథకాల ద్వారా ఇంకెంత కాలము మా తల్లిదండ్రులను మోసం చేయలేవని, ఉన్నత విద్యకు ఉపకార వేతనాలు అందించని ప్రభుత్వం ycp జగన్ ప్రభుత్వం అని అన్నారు కేంద్ర ప్రభుత్వానికి వంతవాడుతూ విద్యావ్యవస్థలోని అశాస్త్రీ అంశాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న దిగజారుడు ప్రభుత్వం పై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పీటర్, ప్రేమ్ కుమార్ ,బన్నీ, సాయి, పలువురు ఏఐఎస్ఎఫ్ నెంబర్లు పాల్గొన్నారు.
Comments