AISF-SFI ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ విజయవంతం
విశాఖఉక్కు ప్రైవేటీకరణ చర్యలు విరమించుకోవాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బందును నందలూరు మండలంలో AISF-SFI ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాలు ద్వారా 32 మంది విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లాభాలు వస్తున్న ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడాలని కార్మికులు ప్రజా సంఘాలు అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం. నవంబర్ 8 నాటికి కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళన వెయ్యి రోజులవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలను బందు నిర్వహిస్తూ విద్యార్థి యువకులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్ణయించాయని రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేసినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు శంకుస్థాపన చేసి ఉక్కు పరిశ్రమను నిర్మాణం కోసం ఒక పైసా కూడా నిధులు కేటాయించలేదు. లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకుంటూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని ప్రధానమైన డిమాండ్ల కోసం జరుగుతున్నటువంటి ఈ బందును విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు ప్రవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయిరాం, మండల నాయకులు జాన్స్, కళ్యాణ్, హరి, ఎస్ఎఫ్ఐ నాయకులు జస్వంత్, షంషేర్ జై సింహా తదితరులు పాల్గొన్నారు.
Comments