కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ.ఐ.టి.యు.సి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.
ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా పోరాటం ఆగవు - ఏఐటియుసి సిపిఐ బాధ్యులు గంగాధర్, తిప్పన ప్రసాద్.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని వదిలి కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలకు, అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రెండవ రోజు భారత్ బంద్ లో భాగంగా ఈరోజు ఉదయం మండల పరిధిలోని చిట్వేల్ నందు సిపిఐ బాధితుడు తిప్పన ప్రసాద్ మరియు ఏ ఐ టి యు సి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గంగాధర్ ఆధ్వర్యంలో.. వ్యవసాయ, కార్మిక,ఉద్యోగ యూనియన్ లను కలుపుకుంటూ ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సామాన్యుని కష్టాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రజా సంక్షేమాన్ని వదిలి కార్పొరేటర్ లతో లాలూచీ పడి వారికి లబ్ధి చేకూర్చే విధంగా చట్టాలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని అమ్మి సొమ్ము చేసుకుంటూ వాటిని నమ్ముకున్న ఉద్యోగులను రోడ్డు పై నిలబెడుతూ... గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణలో ఉంచకుండా నానాటికీ పెంచుతూ" గోరుచుట్టుపై రోకలిపోటు" గా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను వీడి దిగి వచ్చేంత వరకు మా పోరాటాలు ఆగవని ముక్త కంఠంతో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం గంగాధర్, సిపిఐ మండల కార్యదర్శి తిప్పన ప్రసాద్, వ్యవసాయ కార్మిక ఏరియా కన్వీనర్ కేశం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సామా గంగయ్య, ఆటో యూనియన్ నాయకులు పల్లె పాటి పెంచలయ్య, కార్యకర్తలు తిప్పన మనీ, బాలు, కిరణ్, సురేష్, ఆటో యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
Comments