AITUC ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాసవి సర్కిల్ నందలి ఆటో స్టాండ్ వద్ద పట్టణ అధ్యక్షడు వై.హరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఈ చాలనాల జీఓ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నానుద్దేశించి AITUC రాష్ట్ర కార్యదర్శి పి.సుబ్బరాయుడు,ఆటో యూనియన్ పట్టణ గౌరవ అధ్యక్షులు దనిరెడ్డి శివారెడ్డి లు మాట్లాడుతూ ఆటో, లారీ, జీప్ డ్రైవర్లు ప్రభుత్వంపై ఆధారపడకుండా అప్పుసొప్పులు చేసి వారి జీవనాధారంగా డ్రైవర్ వృత్తిని ఎన్నుకుంటే, ప్రభుత్వం ఈ చలనాల పేరుతో దోపిడీకి తెగబడిందన్నారు. ఆమేరకు జీఓ 21ని తెచ్చిందన్నారు. తక్షణం ఈ జీఓ రద్దు చేయాలన్నారు. స్పెర్ పార్ట్శ్ పాటు, డీజల్, గ్యాస్ ఇంధన ధరలు రోజురోజుకు పెంచుతూ పన్నుల మోత పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహన డ్రైవర్లు,కార్మికులను పరిశ్రమగా ఎందుకు గుర్తించడం లేదని వారు ప్రశ్నించారు. తక్షణమే ధరలను అదుపు చేయలేని లేనిపక్షంలో ఆటో, లారీ, జీపు డ్రైవర్లు ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని వారు హెచ్చరించారు.
ఈ ధర్నాలో ఆటో యూనియన్ నాయకులు కన్నెలురు. శ్రీను,హుస్సేన్,వలి, బాబయ్యా, గురు ప్రసాద్,బాషా,మురళి,సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments