కార్మికుల వేతనాలతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారా - AITUC డిమాండ్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణ తీసుకున్న చైతన్య జ్యోతి సొసైటీ వారి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరాయుడు ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రమీలమ్మ రాజమ్మ లు స్థానిక తాసిల్దార్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రొద్దుటూరులో పనిచేయుచున్న 55 మంది శానిటేషన్ సిబ్బందికి 4 నెలలుగా అలాగే వేంపల్లి ప్రభుత్వాసుపత్రిలో పని చేయుచున్న శానిటేషన్ సిబ్బందికి 7 నెలలుగా వేతనాలు చెల్లించకుండా చైతన్య జ్యోతి సొసైటీ వారు కార్మికుల సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆగస్టు 10న స్థానిక మెడికల్ సూపర్నెంట్ కు సమ్మె నోటీసును అందజేశామని నేడు తాసిల్దారు వారికి మా సమస్యల పరిష్కరించాలని చైతన్య జ్యోతి సొసైటీ పై చర్యలు తీసుకొని మా పి ఎఫ్ ఎస్ ఐ పెండింగ్ జీతాలు కట్టించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. దాదాపు 50 శాతం మంది ఒంటరి మహిళలు కుటుంబాలు నెట్టుకు వస్తున్నారని ఈ చాలీచాలని వేతనాలు అందక అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. నాన్ నిండుగా నాలుగు నెలలుగా పెండింగ్ జీతాలు కార్మికులకు ఇవ్వని చైతన్య జ్యోతి సొసైటీకి తిరిగి ఏ రకంగా పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టు ఇస్తారని వారు ప్రశ్నించారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతి నెల 5వ తారీఖు లోపల వేతనాలు ఇస్తేనే వాటిని వేతనాలు అంటారని లేకపోతే కాంట్రాక్టర్ నేరం చేసిన వాడిగా పరిగణించి అతని సొసైటీ రద్దు చేయాలని కాంట్రాక్ట్ యాక్ట్ చెబుతుంటే ఈ నిబంధనలకు అధికారులు నీళ్లు వదలడం వెనక ఉన్న రహస్యమేంటో బహిర్గతం చేసి కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రస్తుతం రోగాల సీజన్ కనుక పాము తాము ఆగస్టు 25 నుంచి సమ్మెకు వెళ్లకుండా నివారణకై మా జీతాలు విడుదల చేయించాలని వారు తాసిల్దారు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కాంటాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ పట్టణ నాయకురాలు చెన్నమ్మ, విమల, సరోజమ్మ, నీరజ, ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు.
Comments