అంగన్వాడీలపై పోలీసులచే ప్రభుత్వం చేయిస్తున్న అమానుష చర్యలను ఖండిస్తూ ఏఐటియూసి అనుబంధ ఏపీ అంగన్వడీ వర్కర్స్ & హెల్పెర్స్ అసోసియేషన్స్ అధ్వర్యంలో స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా Aituc రాష్ట్ర కార్యదర్శి పి.సుబ్బరాయుడు మాట్లాడుతూ నేడు స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కెళ్ళిన కార్యకర్తలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హక్కులను అణచాలంటే పాత హక్కులను హరించలనే దురుద్దేశ్యంతో అంగన్వడీసెంటర్ నందు పిల్లలకు మధ్యాహ్న భోజనం వొండి పెట్టే వాటిని తీసేసి అక్షయపాత్ర అనే ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పను కుట్ర పన్నారని దీన్ని తీవ్రంగా AITUC అంగన్వడీలు వ్యతిరేకించడం తో విజయవాడకు స్కీమ్ వర్కర్లు చేరకుండా ముందస్తుగా అర్థ రాత్రుల్లు పోలీసులను కార్యకర్తల ఇండ్ల కెళ్ళి అరెస్టులు చేయించినా, నిర్భందాలు దాటుకుని విజయాడ చేరారని అన్నారు.ఇది సహించని ప్రభుత్వం విజయాడలోని దాసరిభవన్ వొద్ద సభ్య సమాజం తదించుకునేలా స్కీమ్ వర్కర్లపై అమానుషంగా పోలీసులచే దాడులు చేసి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
అంగన్వడీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాతమ్మ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు విజయ,రమాదేవి లు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించమని,పిఫ్,ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని కోరడమే తప్పన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా పోలీసులచే దాడి చే ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రలో జగనన్న పాలనలో అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులను పోలీసులు బట్టలూడదీసి కొడుతుంటే అన్న వోదిలిన బాణం షర్మలక్క నోరుమేదపక పోవడం శోచనీయమన్నారు.
ఈ నిరసనలో అంగన్వడీ వర్కర్స్ & హెల్పేర్స్ అసోసియేషన్ నాయకురాళ్లు విజయ చంద్రిక,ఛాయాదేవి, మిడ్ డే మిల్స్ నాయకురాలు రమీజా AITUC నాయకులు శ్రీను,రెహమాన్,షరీఫ్,దస్తగిరి,మిరవలి,aisf పట్టణ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments