చిట్వేలి మండల పరిధిలోని శ్రీ సాయి వికాస్ విద్యాసంస్థల యాజమాన్యం తిరుమల విశ్వనాదం, రెడ్డయ్య ల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కరకంబాడి సమీపంలో అమర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిన వైద్య శిబిరానికి చిట్వేలి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వేలాది మంది బాధితులు తరలివచ్చారు.
గుండే వైద్యులు డాక్టర్ వెంకట శివ కృష్ణ, షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వరుణ్, చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కే స్రవంతి, కీళ్ళు మరియు ఎముకల వ్యాధి నిపుణులు డాక్టర్ మునిష్ రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ వై సతీష్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కోటేశ్వర్ రెడ్డి తదితరులు... వచ్చిన బాధితులకు రక్త ఈసీజీ కొలెస్ట్రాల్ బిపి షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తల తో పాటు ఇరువురి సౌజన్యంతో 800 మందికి ఉచితంగా మందులు కూడా అందజేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మరియు నిర్వహకులు మాట్లాడుతూ అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ... సరైన సూచనలు లేక సమస్యలను మరింత తీవ్రతరం చేసుకుంటున్నారని, అట్టివారికి ఆయా వ్యాధిని గుర్తించి తగిన సూచనలు చేయడమే "ఈ మెగా వైద్య శిబిరం" యొక్క ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కాగా శిబిరానికి వచ్చిన బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తూ.. సాయి వికాస్ స్కూల్ యాజమాన్యానికి అమర హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు మరింత మంది ముందుకు రావాలని బాధితులు కోరారు.
Comments