జీవో నంబర్ 45పై రాజధాని ఐకాస లంచ్‌మోషన్ పిటిషన్
రాజధాని అమరావతి పరిధిలో ఇతర జిల్లాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 45పై రాజధాని రైతు ఐకాస నేతలు హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది.
సీఆర్డీఏ పరిధిలో 1130 ఎకరాల భూమిని ఇళ్లస్థలాలకు ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూమిని అప్పగించాలని జీవోలో పేర్కొన్నారు. దీనిపై మార్చి 31న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో విడుదల చేశారు. ఆ భూమి విలువ రూ.1162 కోట్లుగా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. తమ భూముల్లో ఇతరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.
Comments