క్రీడలు విద్యలో అంతర్భాగమని, చదువుతో పాటు ఆటల్లో రాణించాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
ఆదివారం స్ధానిక శరభయ్య ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎస్పీఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు,కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ లు ప్రారంభించారు. కార్యక్రమానికి కొత్త రామకృష్ణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే. అంబటి మాట్లాడుతూ..
విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత కాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా.. నిరుత్సాహంతో మానసిక ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని,చిన్నతనం నుండి క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక,మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. క్రీడలకు సమయాన్ని కేటాయించి,వాటిని ప్రోత్సహించడం యువకుల, విద్యార్థుల బాధ్యతని తెలిపారు.
ఎన్నో వ్యయప్రయసలనోర్చి క్రీడాకారులో ఉత్తేజాన్ని తీసుకురావటానికి నియోజకవర్గ స్థాయిలో ఈ క్రీడలు నిర్వహించటం పట్ల నిర్వాహకులు గంగారపు అనూష,పరిటాల నరేష్ లను ఎమ్మెల్యే అభినందించారు.
ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
గెలుపోటములు స్ఫూర్తిగా తీసుకోవాలని,చక్కని ఆట తీరుతో ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాలని,
విజయవంతంగా ఈ టోర్నీ సాగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు...
Comments