అంబులెన్స్ లు అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేడు నిర్దేశించిన కమిటీ సభ్యుల రేట్ల మేరకు నేటి నుండి అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం నుండి కమిటీ సభ్యులు స్థానిక ఆర్ డి ఓ కార్యాలయంలో అంబులెన్స్ ల యాజమాన్యాలు, డ్రైవర్ లతో సమీక్ష జరిపిన అనంతరం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కమిటీ సభ్యలు సమావేశమై నిర్ణయించిన రేట్లను కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేడు కమిటీ నిర్ణయించిన రేట్లు 3 రకాల వాహనాలకు సంబంధించి రూ.10 లక్షల లోపు విలువల గల అంబులెన్స్ కు (పి.టి.ఎ ఫెసిలిటీ) మొదటి 10 కి.మీ లకు రూ. 750/-, ఆ తరువాత ప్రతి కి.మీ కు రూ.23/- వంతున, ఇ.ఎం.టి – బి సౌకర్యం గల వాహనాలకు మొదటి 10 కి.మీ లకు రూ. 1000/-, ఆ తరువాత ప్రతి కి.మీ కు రూ.33/- వంతున.
రెండవ కేటగిరిలో రూ.10 లక్షల పై విలువల గల అంబులెన్స్ కు (పి.టి.ఎ ఫెసిలిటీ) మొదటి 10 కి.మీ లకు రూ. 1250/-, ఆ తరువాత ప్రతి కి.మీ కు రూ.30/- వంతున, ఇ.ఎం.టి – బి సౌకర్యం బేసిక్ లైఫ్ సపోర్ట్ గల వాహనాలకు మొదటి 10 కి.మీ లకు రూ. 2000/-, ఆ తరువాత ప్రతి కి.మీ కు రూ.50/- వంతున, అడ్వాన్సు లైఫ్ సపోర్ట్ వాహనాలకు (ఏ ఎల్ ఎస్ వాహనాలకు) మొదటి 10 కి.మీ లకు రూ.3000/-, ఆ తరువాత ప్రతి కి.మీ కు రూ.75/- వంతున మాత్రమే వసూలు చేయవలసి ఉంటుందని, తక్షణమే తిరుపతి లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో రేట్ల ప్రదర్శన జరపాలని కమిటీ కి సూచించారు. వీటి పై తరచూ తనిఖీల నిర్వహణ కూడా ఉండాలని ఆదేశించారు. ఎం ఓ యు లేని అంబులెన్స్ లు ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణ లోపల ఉండరాదని తెలిపారు.
ఈ సమీక్ష లో ఆర్దిఒ కనకనరసా రెడ్డి, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి సీతారామిరెడ్డి, డి ఎస్ పి మురళీకృష్ణ, జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీహరి లు పాల్గొన్నారు.
תגובות