వై.ఎస్.ఆర్ కడప జిల్లా చాపాడు మండల పరిధిలోని సిద్ధారెడ్డి పల్లె గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ ఏర్పడటం వలన ఏపి39టిఎన్9819 నెం గల అంబులెన్స్ లో మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతి అయిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కధనం ప్రకారం గ్రామానికి చెందిన కె. వీర శంకర్ రెడ్డి వృత్తిరీత్యా అంబులెన్స్ వాహనాలను కలిగి ఉండగా, ఇతను ప్రొద్దుటూరులో ప్రైవేట్ హాస్పిటల్ వద్ద అంబులెన్సులను బాడుగకు తిప్పేవాడు. తన తండ్రి రామిరెడ్డికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అంబులెన్స్ లో మదనపల్లె కు తీసుకు వెళ్లేందుకు తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరారు. గ్రామం నుండి జడ్జిగారి కోట్టాలు సమీపానికి వెళ్లగా అంబులెన్స్ లో మంటలు ఏర్పడ్డాయని. దీనితో అప్రమత్తమైన శంకర్ రెడ్డి తన తండ్రిని అంబులెన్స్ నుండి కిందికి దించి గ్రామస్థులకు సమాచారం అందించారన్నారు. ఈ సంఘటనలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తులు మైదుకూరు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ వుండడంతో పేలుతుందన్న అనుమానంతో ఎవరు మంటలు ఆర్పే ప్రయత్నం సాహసం చేయలేదు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
top of page
bottom of page
Comments